script src='http://www.mahigrafix.com/javascript/rainbow.js' సిరిమల్లె: నేనెందుకిలా -2

Tuesday, May 5, 2009

నేనెందుకిలా -2


వంటింట్లో అమ్మ హడావుడిగా ఉంది.అన్నయ్య స్నానంచేసేసి స్కూలుకు రెడీఅవుతున్నాడు.చెల్లి అమ్మ వెనుకేతిరుగుతూ ఎందుకోమారాం చేస్తూంది.నాన్న వరండాలో గ్రిల్ల్సు ప్రక్కన కూర్చుని పేపరు చదువుకొంటున్నాడు.నేను గవర్నమెంటు స్కూలులో ఆరవ తరగతి చదువుతున్నాను.ఇంగ్లీషు మీడియం."బృందా! లేచావా?త్వరగా రెడీ అవ్వు.ఇప్పటికే ఆలశ్యమయ్యింది."అని నాకు చెప్పి చెల్లెలిపై కోప్పడుతూందెందుకో.అన్నయ్య ఏదోపని చేసుకొంటూ కనుకొలుకుల్లోంచీ నావైపు చూశాడు.అమ్మా నాన్నా వాడి కన్నా నన్ను బాగా చూసుకొంటారని వాడి అభిప్రాయం.అందుకే అప్పుడప్పుడూ అలా చూస్తూ ఉంటాడు. బాత్రూంవైపు పరిగెత్తాను.

స్నానంచేసియూనిఫాం వేసుకొని అన్నంతినడానికి రెడీగా డైనింగ్ టేబులు దగ్గరకు చేరాను.తొమ్మిదిన్నరకు స్కూల్లో ఉండాలి.ఈరోజు చెల్లి స్కూలుకు ఎగ్గొట్టేలా ఉంది. అది మాస్కూలులోనే నాలుగు చదువుతూంది.నాతోనేతీసుకెళతాను.ఒక రోజు వస్తే నాలుగు రోజులు రాదు.అన్నయ్య ,అన్నట్టు వాడిపేరు శివకుమార్.అందరూవాడిని శివా అని పిలుస్తారు.నాప్రక్కన కుర్చీలో వచ్చి కూర్చున్నాడు గంభీరంగా.-నేను నీకంటే పెద్ద అన్నభావం వాడి ప్రతి కదలికలోనూ కన్పింప చేస్తాడు వాడు.
పుస్తకాల సంచీతగిలించుకొని పరిగెత్తాను.మాస్కూలు నాలుగు వీధులవతల ఉంది.పెద్ద కాంపౌండులో పెద్ద బిల్డింగులో ఉంది మా స్కూలు.ఇది అమ్మాయిలకు ప్రత్యేకం.శివా, బాయిస్ స్కూల్లో చదువుతున్నాడు.కాత్యా,దీపికా,సింధుజా నా స్నేహితులు.నన్ను
స్కూలు వైపుకు లాగే అయస్కాంతాలు వాళ్ళు.ప్రేయరుముగించి ఎవరి క్లాసులకు వారు వెళ్ళి కూర్చున్నారు.మేంనలుగురం ఒకే బెంచిలో కూర్చుంటాం ఎప్పుడూ.
ఈదినచర్య ఇలాగే సాగుతుంది రోజూ.కాకుంటేచిన్న చిన్న మార్పులతో.నేనెప్పుడూ క్లాసులో ఫస్టే.మా మిస్సులు నేనెలారాసినా
మార్కులు వేస్తారేమో! సింధుజ నాకంటే బాగా చదువుతుంది .కానీమార్కులే రావెందుకో.కాత్యా,దీపికలు చదువులో కొంచెం వీక్.స్కూలు ఐపోయిన తర్వాత మేమెప్పుడూ చదువు గురించి మాటాడుకొనేవారంకాదు.అంతా ఆటలే!అప్పుడప్పుడూ సినిమా డాన్సులు కూడా వేసేవాళ్ళం.
బిజీ బిజీగా క్షణం తీరిక లేకుండా సాగిపోతున్న నా బాల్యంలో ఇంత సంతోషం దాగి ఉందని నాకు అప్పుడు తెలీలేదు.అందరికీ ఇలాగే ఉంటుందనుకొన్నాను.కానీ కొందరి బాల్యం విషాదంగాకూడా ఉంటుందని నిశ్చల పరిచయమయ్యేవరకూ నాకు తెలీనే తెలీదు.
నిశ్చ్లల మాస్కూల్లో కొత్తగా చేరింది.మాక్లాసే! మొదటి రోజే మా గ్రూపులో చేరి పోయింది.తన పేరులాగే అమ్మాయి దేనికీ తొణకదు,
బెణకదు.చాలా సైలెంటుగా ఉండేది.మాగ్రూపులోని మిగతాముగ్గురికంటే నామనసుకు బాగా దగ్గరయ్యింది నిశ్చల.అలా కాకున్నా బాగుండేదని ఇప్పుడనిపిస్తూంది............

6 comments:

  1. Nostalgia baagundi. Ist partlo maranasayyapy modalupetti baalyamloki jump ayyaru. inta konchem konchem raste elaaa?

    ReplyDelete
  2. baagundi andi elaa ge kona saaginchandi....
    inkaa ...ekuuvagaa raaste ...baaguntudi ...ani maa manavi...baalyaa vasta smrutulanu tadumutunnaru...continue cheyyandi
    NARESH THURPINTI RGUKT, BASAR

    ReplyDelete
  3. జయచంద్రగారు ,అభినందనలు ...హరివిల్లు తో పాటు విరిజల్లు కురిపిస్తున్నందుకు ....

    ReplyDelete
  4. నిశ్చల కు ఏమైంది? ఎందుకు అండి మాకు ఇంత tenction పెడతారు తొందరగా రాయరాదు...

    ReplyDelete
  5. బ్లాగు మిత్రులకు నమస్కారం. మీ అభినందనలకు కృతఙతలు.మరీ ఎక్కువగా రాస్తే చదివే వారికి అసౌకర్యంగా ఉంటుందని కొంచెంగా వ్రాస్తునాను.క్షమించండి.కానీ త్వర త్వరగా రాయడానికి ప్రయత్నిస్తాను .అనేక మలుపులు తిరగబోతున్న ఈ కధలో మీరు నాకు తోడు గా ఉంటారని ఆసిస్తాను .

    ReplyDelete