script src='http://www.mahigrafix.com/javascript/rainbow.js' సిరిమల్లె: నేనెందుకిలా --1

Tuesday, April 28, 2009

నేనెందుకిలా --1


నేనెందుకిలా........
----------------

అదిగో మృత్యువు చిన్న చిన్న గా నా దరి చేరుతూంది.క్రమంగా ఊపిరి అందటం మానేస్తూంది.ఆరు దిక్కుల మద్య నేనేకాకినై మాంసపు ముద్దలా మారిపోతున్నాను.నాలుగు దిక్కులూ ,ఆకాశం,భూమి అన్నీ దగ్గరకు చేరి నన్ను మధ్యలో నలిపి వేస్తున్నాయి.యింకెంతసేపు? కొన్ని క్షణాలు.అంతే! తర్వాత?
కొన్ని వందలమంది నా చుట్టూ చేరి దుఃఖిస్తూ ఉన్నారు.కొందరైతే గుండెలు బాదుకొంటున్నారు.ఇంత ప్రేమ,ఆప్యాయతలునామీద కురుస్తున్నా నాకు తృప్తిగా
లేదు.చివరి క్షణాల్లో ఉండవల్సిన మనశ్శాంతి నాకళ్ళకు కన్పించనంత దూరం వెళిపోయింది. అదిగో నా నిర్జీవమైన శరీరాన్ని తీసికెళ్ళటానికి రధంతయారౌతూ ఉంది.బాజా భజంత్రీలు వచ్చేశాయి. ఇక నేను మరణించడమేతరువాయి. హంగామా అంతా నాకు తెలుస్తూనేఉంది.చిన్నగా కళ్ళు తిప్పి నాచుట్టూ కూర్చుని గుండెలు బాదుకొంటూ ఏడుస్తున్న వాళ్ళను చూశాను.
ఏకధాటిగా కన్నీరు కారుస్తున్న వీరి గుండెల్లో తడి ఉందా? కళ్ళు కాలవలైనప్పుడు గుండె జలాశయం కావాలి కదా! ఎండిన గుండెలనుండీ కళ్ళల్లోకి నీరెలా వస్తుంది? ఆలోచిస్తున్నాను....
ఊపిరి తీసికోవటం క్షణ క్షణానికీ కష్టమౌతూంది.......ఈచివరిక్షణాల్లో నాకెందుకింత ఆవేదన........నేనెందుకిలా.....? నా ఆలోచనలు గతాన్ని త్రవ్వుకుంటూ వెళ్ళాయి........
******** ******** ********

నా పేరు బృందావని.ఆరోజు సోమవారం.ఆదివారమంతాఆటలతో అలసిన వొళ్ళు బడలికగా కళ్ళుభారంగా,బెడ్డుమీదనుంచీలేచేందుకుఏమాత్రంసహకారంఅందించనంటున్నాయి.కుడివైపు బెడ్ మీద చూశాను .అన్నయ్య అప్పుడే లేచేసి నట్టున్నాడు.వాడికి పన్నెండేళ్ళ వయసు.ఎనిమిది చదువుతున్నాడు.
ఎడమవైపు చూశాను.బెడ్డుమీద చెల్లిలేదు.ఏమిటీ? ఇదికూడా లేచేసిందా....ఆశ్చర్యంగా గోడ కున్న గడియారం వైఫు చూశాను.ఎనిమిదయ్యింది.అయ్యో!స్కూలుకెళ్ళాలిగదా!అమ్మ కూడా
లేపలేదేమిటి చెప్మాఅనుకుంటూ ఒక్క ఉదుటునలేచాను.

4 comments:

  1. Gripping style of writing...

    ReplyDelete
  2. ఒక అందమైన ఉంత్కంఠబరితమైన నవల చదువుతున్నట్టు వుంది మిత్రమా అద్బుతం , అమోఘం కొనసాగించండి మీ జైత్రయాత్రను
    స్నేహ హస్తంతో .....శ్రీ

    నా బ్లాగును కూడా ఒక్క సారి చూస్తేపోలా
    http://sreesai24.blogspot.com

    ReplyDelete
  3. adbhtha maina kathanam kona saaginchandi, eduru chusthuu

    ReplyDelete